- Get link
- X
- Other Apps
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini Lyrics - S. P. Balasubramanyam, P. Susheela
| Singer | S. P. Balasubramanyam, P. Susheela |
| Composer | K.V. Mahadevan |
| Music | |
| Song Writer | Sirivennela Sitaramasastri |
Lyrics
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం... ఓం...
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
యెదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.... ఆ ఆ...
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది...
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం..
ప్రాగ్దిశ వీనియ పైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిశ వీనియ పైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం..
జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం..
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం ఈ గీతం..
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini Watch Video
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment